యాదగిరిగుట్టలో  మే 23న కేబినెట్‌ భేటీ!

యాదగిరిగుట్టలో  మే 23న కేబినెట్‌ భేటీ!

హైదరాబాద్, వెలుగు: గురువారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 21కి బదులుగా ఈ నెల 23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే, 21 నుంచి కాళేశ్వరంలో సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున కేబినెట్ వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఈ నెల 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాల, గోశాల శంకుస్థాపన తదితర కార్యక్రమాలు ఉన్నందున.. అక్కడే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించారు.