కాఫీలోని కెఫిన్​.. బ్రెయిన్​ని రిలాక్స్​ చేస్తుంది

కాఫీలోని కెఫిన్​.. బ్రెయిన్​ని రిలాక్స్​ చేస్తుంది

మెదడు పనితీరుపైనే ​ బాడీ ఫంక్షనింగ్ అంతా ఆధారపడి ఉంటుంది. అందుకే మెదడుని ఎప్పుడూ ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోవాలి. అందుకోసం ఈ హెల్దీ ఫుడ్​ని డైట్​లో  చేర్చాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్​​. మరి ఆ ఫుడ్​ ఏంటంటే..

  • డార్క్​ చాక్లెట్స్​​​లో  ఫ్లేవనాయిడ్స్ అనే బ్రెయిన్​ బూస్టింగ్​ కాంపౌండ్​​ ఉంటుంది. ఇది మెదడుకి కేర్​ టేకర్​గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మూడ్​స్వింగ్స్​ని తగ్గిస్తుంది. 
  • కోడిగుడ్డులో ఉండే విటమిన్–​ ఎ, బి5, బి12, బి2, ఫోలేట్​, ఫాస్ఫరస్, సెలీనియం బ్రెయిన్​ ఫంక్షనింగ్​కి సాయం చేస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే క్రోలిన్​.. బ్రెయిన్​ సెల్స్​ కమ్యూనికేషన్​ని మెరుగుపరుస్తుంది. 
  • ఒమెగా ​ ఫ్యాటీ యాసిడ్స్​ ఎక్కువగా ఉండే చేపలు తింటే.. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇవి తింటే మెదడులో రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. 
  • వాల్​నట్స్​లోని హెల్దీ ఫ్యాట్స్​ బ్రెయిన్​ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే దీన్ని బ్రెయిన్​ ఫ్రెండ్లీ ఫుడ్​ అంటారు. రోజుకి గుప్పెడు వాల్​నట్స్​ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొన్ని స్టడీల ప్రకారం వాల్​నట్స్​ డిప్రెషన్​పైనా పోరాడతాయి. బ్రెయిన్​ సెల్స్​ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
  • పాలకూర, తోటకూర, బ్రొకోలిలో బ్రెయిన్​ని హెల్దీగా ఉంచే విటమిన్​–కె ఎక్కువగా ఉంటుంది. ఇవి థింకింగ్​ పవర్​ని పెంచుతాయి. 
  • ‘ది జర్నల్​ ఆఫ్​ న్యూట్రిషన్​’ స్టడీ ప్రకారం కాఫీలోని కెఫిన్​.. బ్రెయిన్​ని రిలాక్స్​ చేస్తుంది. మూడ్​ స్వింగ్స్​ నుంచి బయటపడేస్తుంది.