కల్వకుంట్ల పేరు తీసేసి అబద్దాల ప్రొపెసర్ అని పెట్టుకో కేసీఆర్ : జగ్గారెడ్డి

 కల్వకుంట్ల పేరు తీసేసి అబద్దాల ప్రొపెసర్ అని పెట్టుకో కేసీఆర్ :  జగ్గారెడ్డి

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ బాధ కరెంట్ గురుంచి కాదని.. పొలిటికల్ పవర్ లేదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసే సమయంలో మూడు సార్లు కరెంట్ పోయిందంటే ఎవరు నమ్మరన్నారు. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్దాల ప్రొపెసర్ కేసీఆర్ అని పెట్టాలన్నారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.  

 కేసీఆర్.. నిజాన్ని అబద్దాలుగా మరల్చి ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హెచ్చరించారు.  పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్‌లో కేసీఆర్ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఎన్నడు ప్రజలు గుర్తుకు రాని కేసీఆర్ కు ఇవాళ ఎంపీ ఎన్నికల్లో గత్యంతరం లేక ప్రజల్లోకి వచ్చారని ధ్వజమెత్తారు.  తెలంగాణలో కాంగ్రెస్ 14 పార్లమెంట్ సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు జగ్గారెడ్డి.