హైదరాబాద్ సిటీ, వెలుగు: మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించి శుక్రవారం వరకు 36 మంది అభ్యర్థుల నుంచి 52 సెట్ల నామినేషన్లు వచ్చినట్లు హైదరాబాద్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి తెలిపారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నామని, ఈ 22 మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఉందన్నారు. నామినేషన్ల కార్యక్రమంలో ఎస్ఈఎం జ్యోతి, లా ఆఫీసర్ శ్రీధర్, డీసీవో ప్రసన్న పాల్గొన్నారు.
