ఉప్పల్, వెలుగు: తన కొడుకు చనిపోయిన కేసును రీ ఓపెన్ చేసి న్యాయం చేయాలంటూ మృతుడి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. గత నెల 21న ములుగు జిల్లా కొంగల సమీపంలో ఉన్న జలపాతంలో పడి వెంకట సాయిమూర్తి(18) అనే యువకుడు మృతి చెందాడు. మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్లో మృతుడి తండ్రి పవన్ గణేశ్ఫిర్యాదు చేశాడు.
తన కొడుకు మృతికి రామంతపూర్‌లోని జువెలరీ షాపు యజమాని కుటుంబమే కారణమని వారు తల్లిదండ్రులు ఆరోపించారు. శుక్రవారం ఆ షాపు ఎదుట ఆందోళనకు దిగారు. కేసు రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాజేడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని సూచించారు.
