కూకట్పల్లి, వెలుగు: బస్టాండ్లో ఓ వ్యక్తి పోగొట్టుకున్న బంగారాన్ని కేపీహెచ్బీ పోలీసులు మూడు గంటల వ్యవధిలో గుర్తించి అప్పగించారు. పోలీసులు తెలిపిన ప్రకారం బాచుపల్లిలో నివసిస్తూ ఐటీ ఉద్యోగం చేస్తున్న కె.సతీశ్ గురువారం మధ్యాహ్నం కేపీహెచ్బీ బస్టాప్లో బంగారం చైన్ ఉన్న బ్యాగ్ని మర్చిపోయి వెళ్లిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ బ్యాగ్ను గుర్తించి తిరిగి బాధితుడికి అప్పగించారు.
