మాలల రణభేరిని సక్సెస్ చేయాలి : లకుమాల మధుబాబు

మాలల రణభేరిని సక్సెస్ చేయాలి : లకుమాల మధుబాబు

నల్గొండ అర్బన్, వెలుగు: ఈ నెల 23న హైదరాబాద్‌లోని సరూర్ నగర్ లో నిర్వహించనున్న మాలల రణభేరిని సక్సెస్ చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు తెలిపారు. శుక్రవారం నల్గొండలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన డేటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, రోస్టర్ పాయింట్లు కేటాయింపును పున:సమీక్షించి జీవో 99 సవరించి మాలలతో పాటు గ్రూప్ 3లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు బూర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. మాల మహానాడు జిల్లా నాయకులు జంగాల వీరేందర్,  రాయల మౌనిక, నాగమణి, శ్రీలత, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.