నాసిక్ (మహారాష్ట్ర): మెషీన్లు (జెట్స్) యుద్ధాలను గెలవలేవని, వాటిని నడిపే పైలెట్ల నైపుణ్యం, నిర్ణయాలు, సంకల్పమే యుద్ధాలను గెలిపిస్తుందని సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ అన్నారు.
శుక్రవారం ఇక్కడ కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ పాసింగ్ అవుట్ సందర్భంగా ఆయన క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ దశాబ్ద కాలంలో యుద్ధం తీరు, స్వభావం వేగంగా మారుతోందని చెప్పారు.
వ్యూహాత్మక కార్యాచరణ, సామర్థ్యం, మల్టీ డొమైన్ రక్షణ వ్యవస్థలు (భూమి, సముద్రం, వాయు, స్పేస్), వేగవంతమైన సైనిక చర్యగా రూపాంతరం చెందుతున్నదని అన్నారు. పరిస్థితులను అవగాహన చేసుకొని, విధానాలకు కట్టుబడి పనిచేయాలని క్యాడెట్లకు ఆయన సూచించారు.
