The Girlfriend OTT Release: ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్‌'.. ఎమోషనల్ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

The Girlfriend OTT Release: ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్‌'.. ఎమోషనల్ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , దీక్షిత్ శెట్టి కలిసి  నటించిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'.  నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా మూవీ  ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రష్మిక నటనకు దేశవ్యాప్తంగా విశేషమైన స్పందనను అందుకుంది. భూమాదేవి అనే అమాయకపు అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించారని సినీ విశ్లేషకులు కొనియాడారు. రష్మిక కెరీర్ లోనే బెస్ట్ పాత్రగా నిలిచిపోతుందని మెచ్చుకున్నారు.

అయితే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తాపడింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. డీసెంట్ ప్రారంభం తర్వాత వసూళ్లు నెమ్మదించాయి. సక్సెస్ టాక్ ను అందుకున్నా.. అంచనాలకు తగ్గట్లుగా థియేటర్లలో నిలబడలేపోయింది. ఈ చిత్రం ఇప్పుడు తన థియేట్రికల్ రన్ ను ముగించుకోబోతోంది. సినీ ట్రెడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ మూవీ రూ.17.33 కోట్ల మేరకు వసూలు రాబట్టినట్లు తెలుస్తోంది. 

ఓటీటీలో ఎప్పుడంటే?

ఓటీటీ డీల్ తో 'ది గర్లఫ్రెండ్స్' నిర్మాతలకు కాస్త ఊరట నిచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.42 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి , థియేట్రికల్ వసూళ్లు తగ్గినా.. బలమైన నాన్ థియేట్రికల్ డీల్ తో ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకున్నట్లైంది. డిసెంబర్ 11న, ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది,  థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతకు, రష్మిక నటనను డిజిటల్‌గా ఆస్వాదించడానికి ఇది ఒక మంచి అవకాశం.

బలమైన కథనం..

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించిన 'ది గర్ల్‌ఫ్రెండ్‌'.. ఒక అదుపుచేసే, హానికరమైన సంబంధంలో చిక్కుకున్న యువతి భూమా దేవి ఆత్మసాక్షాత్కారం. ఆమె జీవితాన్ని తిరిగి పొందే ప్రయాణాన్ని చూపిస్తుంది. సినిమాకి భూమా పాత్ర ప్రధాన బలం. రష్మిక (భూమా) ప్రేమ, స్వీయ-రక్షణ మధ్య నలిగిపోయే పాత్రకు ప్రాణం పోసింది. ఆమె నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. దీక్షిత్ శెట్టి (విక్రమ్) భూమా ప్రేమికుడిగా, నెగటివ్ షేడ్స్‌తో కూడిన చీకటి పాత్రలో మెప్పించాడు. అతని పాత్రలో చార్మ్, మెనస్  రెండింటినీ చూపిస్తూ ప్రేక్షకులకు భయానకంగా అనిపించాడు. ఇక ఈ మూవీలో అను ఇమ్మానుయేల్, రావు రమేష్ ,రోహిణి మొల్లెటి, రాహుల్ రవీంద్రన్ వంటి నటీనటులు తమ పాత్రల పరిధిలో కథకు బలాన్నిచ్చారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం, ముఖ్యంగా 'నదివే' పాట మెలొడీ శ్రోతలను ఆకట్టుకుంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ హైదరాబాద్, విశాఖపట్నంలలోని లొకేషన్స్‌ను అందంగా చూపింది.

బాలీవుడ్‌లో రష్మిక.. 

రష్మిక ఇప్పుడు తన తదుపరి పెద్ద ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఆమె బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ మరియు కృతి సనన్ లతో కలిసి 'కాక్‌టెయిల్ 2'లో నటిస్తోంది. 2012 నాటి హిట్ చిత్రం 'కాక్‌టెయిల్'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి. రొమాన్స్, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలోకి రానుంది. ఈ బోల్డ్ రోల్‌లో రష్మిక ఎలా మెప్పిస్తుందో చూడటానికి సినీ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు మూడు చిత్రాల్లో కూడా ఈ బ్యూటీ నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది.