BMW OTT Release: వెయిటింగ్ ఓవర్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

BMW OTT Release: వెయిటింగ్ ఓవర్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్  ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. సాంగ్స్, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో హీట్ పెంచినప్పటికీ, థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రవితేజ కామెడీ టైమింగ్, ఇద్దరు హీరోయిన్ల మధ్య మాస్ రాజా రొమాన్స్‌ను చూడాలని ఆసక్తిగా ఉన్నారు. అందుకే థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్.. ఓటీటీలో తప్పకుండా చూడాలని ఫిక్స్ అయ్యారు.

అయితే, సినిమా విడుదలై రెండు నెలలు అవుతున్నప్పటికీ ఓటీటీకి రాకపోవడంతో ప్రేక్షకులు పూర్తిగా డిస్సప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆడియన్స్ వెయిటింగ్కి ఎండ్ కార్డ్ వేస్తూ, మార్చి 9న స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది సదరు ఓటీటీ సంస్థ.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ:

సంక్రాంతి రేసులో నిలిచిన పెద్ద సినిమాల్లో ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకున్న మొదటి చిత్రం ఇదే. ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. కానీ కొన్ని కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 13, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

“నిరీక్షణ ముగిసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మార్చి 13న జీ5లో స్ట్రీమింగ్” అవుతుంది అనే క్యాప్షన్ తో జీ5 ట్వీట్ చేసింది.  సంక్రాంతి పండుగ తర్వాత దాదాపు రెండు నెలల గ్యాప్‌తో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇకపోతే, థియేటర్లో మూవీ బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, ఓటీటీలో మాత్రం రవితేజ మేనియా ఎప్పుడూ టాప్ గేర్‌లోనే ఉంటుంది. హోమ్ ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ఈ సినిమాకు అసలైన సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. 

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ:

రామ్ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ కంపెనీ యజమాని. తన భార్య బాలమణి (డింపుల్ హయతి)తో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. బాలమణి తన భర్తపై అపారమైన ప్రేమతో పాటు, అతను ఎప్పటికీ తప్పు చేయడని గట్టి నమ్మకంతో జీవిస్తుంది.

ఈ సమయంలో వ్యాపార పనుల నిమిత్తం రామ్ స్పెయిన్‌కి వెళ్తాడు. అక్కడ అనుకోని పరిణామాల మధ్య మానస శెట్టి (ఆషికా రంగనాధ్) తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. మానస ముందు రామ్ తన అసలు పేరు చెప్పకుండా “సత్య”గా పరిచయం అవుతాడు. క్రమంగా వారి మధ్య స్నేహం పెరిగి, అది ఒక అనుకోని తప్పుకు దారి తీస్తుంది.

అనుకోకుండా జరిగిన ఆ పొరపాటు రామ్ అలియాస్ సత్య జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది? మానసతో అతని సంబంధం భార్య బాలమణికి తెలిసిందా? తెలిసిన తర్వాత ఆమె ఎలా స్పందించింది? ఒక వైపు భార్య, మరో వైపు ప్రియురాలు మధ్య చిక్కుకున్న రామ్..  పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.