ఫ్లై ఓవర్పై హార్ట్ ఎటాక్.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కారు డ్రైవర్తో సహా నలుగురు మృతి

ఫ్లై ఓవర్పై హార్ట్ ఎటాక్.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కారు డ్రైవర్తో సహా నలుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఫ్లైఓవర్ పైన వెళ్తుండగా డ్రైవర్ కు హార్ట్ అటాక్ రావడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు బైక్స్, ఇతర వెహికిల్స్ ను ఢీకొట్టడంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది.  స్పీడ్ గా వచ్చిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఇతర వాహనాలను డీకొట్టి రోడ్డుపై పడిపోయింది. కారు వేగానికి బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడటం టెర్రిఫిక్ గా మారింది  ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

శుక్రవారం (నవంబర్ 21) సాయంత్రం 7 గంటల ప్రాంతంలో థానె జిల్లాలోని అంబర్నాథ్ ఫ్లైఓవర్ పై ఈ యాక్సిడెంట్ జరిగింది. అంబర్నాథ్ సిటీని కలిపే ఫ్లై ఓవర్ పై తూర్పు నుంచి పడమర వైపు వెళ్తుండగా.. టాటా నెక్సాన్ కారు ప్రమాదానికి గురైంది.  CCTV లో రికార్డైన విజువల్స్ భయానకంగా కనిపించాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయాడు.

ప్రచారానికి వెళ్తూ..

శుక్రవారం సాయంత్రం సివసేన స్థానిక సంస్థల నేత కిరణ్ చౌబే తన అనుచరులతో కలిసి ప్రచారానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ లక్ష్మణ్ షిండే కు డ్రైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండె పట్టేయడంతో కారు పూర్తిగా అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీకొట్టింది. 

ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడున్న ఇతర వాహనదారులు.. చౌబే ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఇక చౌబే డ్రైవర్ షిండే, ఇద్దరు స్థానియ యువకులు చెలానీ, శైలేష్ యాదవ్ స్పాట్ లోనే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.