రూ. 600 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. 14 మంది అరెస్ట్

  రూ. 600 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత..  14 మంది అరెస్ట్

భారత్‌లోకి రూ. 600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్న పాక్‌ బోట్‌ను  ఇండియన్ కోస్ట్ గార్డ్ రహస్యంగా పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా  యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) జాయిట్ అపరేషన్ నిర్వహించింది.  

డ్రగ్స్‌తో పాటు పాక్ నౌకలోని 14 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 600 కోట్ల విలువైన సుమారు 86 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  గత కొన్ని రోజులుగా ఈ  అపరేషన్  నిర్వహిస్తు్న్నామని అధికారులు తెలిపారు.  స్వాధీనం చేసుకున్న పాకిస్తానీ పడవ, దాని సిబ్బందితో పాటు తదుపరి విచారణ కోసం పోర్‌బందర్‌కు తరలించారు.