IND vs NZ: వరల్డ్ కప్‌ను డామినేట్ చేస్తున్న రోహిత్, కోహ్లీ.. న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు భారీ హైప్

IND vs NZ: వరల్డ్ కప్‌ను డామినేట్ చేస్తున్న రోహిత్, కోహ్లీ.. న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు భారీ హైప్

భారత క్రికెట్ జట్టు 2026 ప్రారంభంలో న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య జనవరి 11న తొలి వన్డే జరగనుంది. వడోదర ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. కొత్త సంవత్సరంలో టీమిండియా ఆడబోయే తొలి సిరీస్ ఇదే కావడంతో ఈ మెగా సిరీస్ కు భారీ హైప్ నెలకొంది. సొంతగడ్డపై జరుగుతుండడంతో ఈ సిరీస్ లో భారత జట్టు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ తర్వాత టీమిండియా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. వచ్చే నెలలో టీ20 వరల్డ్ కప్ ఉండడంతో స్టార్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కు రెస్ట్ తీసుకొని కేవలం టీ20 లపై మాత్రమే దృష్టి పెట్టనున్నారు. 

తొలి వన్డేకు టికెట్లన్నీ సోల్డ్ ఔట్:

న్యూజిలాండ్ తో జరగబోయే తొలి వన్డేకు 10 రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం వడోదర వన్డే టిక్కెట్లు కేవలం ఎనిమిది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. టికెట్లన్నీ రిలీజ్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫ్యాన్స్ ఇంతలా ఈ మ్యాచ్ చూడడానికి కారణం లేకపోలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. వీరు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉండడంతో ఫ్యాన్స్ రోకో బ్యాటింగ్ చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నెంబర్ వన్ ర్యాంక్ లో ఉండగా.. కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.  

ఆశ్చర్యకరంగా టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ టీ20 వరల్డ్ కప్ కంటే కూడా వన్డే మ్యాచ్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. వరల్డ్ కప్ కు టికెట్స్ రిలీజ్ చేసినా ఇంకా అమ్ముడుపోలేదు. అయితే వన్డే మ్యాచ్ కు మాత్రం నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ అమ్ముడయ్యాయి.కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య కేవలం 8 రేటింగ్ పాయింట్స్ మాత్రమే తేడా ఉండడం విశేషం.ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు చేస్తే.. కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. 

ఈ సిరీస్ కు ముందు నాలుగో స్థానంలో ఉన్న విరాట్.. తన అసాధారణ బ్యాటింగ్ తో రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.  సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ విఫలమై ఉంటే.. కోహ్లీ అగ్రస్థానంలో ఉండేవాడు. అయితే మూడో వన్డేలో రోహిత్ తో పాటు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ లో బాగా ఆడితే కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవచ్చు.