ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించినట్లు ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. రేపటి సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ హాజరుకావొద్దని నిర్ణయించినట్లు వెల్లడించారాయన. మూసీ రివర్ డెవలప్ మెంట్ అంశంపై సభలో జరిగిన చర్చ తర్వాత.. వాకౌట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.
సభను వాకౌట్ చేసి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సభలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. మైక్ ఇవ్వమని కోరినా.. స్పీకర్ ఇవ్వలేదని.. మా పార్టీ వాయిస్ వినిపించే అవకాశం లేనందుకు వాకౌట్ చేశామని చెప్పిన హరీశ్ రావు.. ఈ శీతాకాల సమావేశాల్లోనూ.. మిగతా రోజుల్లో జరిగే సభకు హాజరుకాకూడని నిర్ణయించినట్లు వెల్లడించారు హరీశ్ రావు.అసెంబ్లీ నుంచి బైకాట్ చేసిన బీఆర్ఎస్ గన్ పార్క్ లోని అమరవీరుల స్నారక స్థూపం వద్ద బైటాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు. ప్రభుత్వం బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదోవ పట్టించేలా చేస్తుందన్నారు. అడ్డగోలుగా గంటన్నర సమయం ముఖ్యమంత్రి టైంపాస్ చేశారని చెప్పారు. స్పీకర్ , ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రిని విమర్శించద్దంటే ఎలా అని ప్రశ్నించారు హరీశ్. రేపు (జనవరి 3)అసెంబ్లీని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించిందన్నారు.
కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుందన్నారు హరీశ్ రావు. ప్రజా స్వామ్య విలువలకు విరుద్ధంగా శాసన సభ జరుగుతుందని..అందుకే తాము శాసన సభను బాయ్ కట్ చేశామన్నారు. అసలు మూసీ మూసీ ప్రక్షాళన మొదలు పెట్టిందే తామన్నారు హరీశ్ రావు. తాము మూసి ప్రక్షాణలకు అడ్డు చెప్పడం లేదన్నారు. ప్రతి రోజు కెసిఆర్ చావు కోరుకుంటున్న సీఎం.. స్ట్రీట్ రౌడీ లాగ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభలో అందరికి సమాన హక్కులు కల్పించాల్సిన స్పీకర్ ఏకపక్షంగా సభను నడుపుతున్నారని విమర్శించారు. RR టాక్స్ పెట్టీ బిల్డర్స్ నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు హరీశ్ రావు. హైదరాబాద్ లో ఏ బిల్డింగ్ కట్టాలన్నా కాంగ్రెస్ పార్టీ కి టాక్స్ కట్టాలన్నారు.
మరో వైపు కృష్ణా,గోదావరి జలాలపై చర్చ సందర్భంగా సెషన్స్ ను బీఆర్ఎస్ బైకాట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. నిజాలు బయటపడుతాయనే బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి బైకాట్ చేస్తుందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.
