మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ..గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ..గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా  లొంగుబాటు

మావోయిస్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది.  మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పని చేస్తున్న బర్సే దేవా తెలంగాణ డీజీపీ  శివధర్ రెడ్డి ముందు లొంగిపోయాడు. హెడ్మా  ఎన్ కౌంటర్  తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్నాడు  బర్సే దేవా.  హైడ్మా,  బర్సే దేవా  ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలోని  ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.  ఇద్దరు దాదాపు ఒకేసారి మావోయిస్టు పార్టీలో చేరారు.  మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించేవాడు .  దేవా నుంచి మౌంటెన్ ఎల్ఎంజి స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు  మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు డీజీపీ ముందు లొంగిపోయారు. జనవరి 3న బర్సే దేవాను పోలీసులు  మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.

మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టేనా..!

2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​కగార్‌‌‌‌‌‌‌‌తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్నది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి మూడు నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన అగ్రనేతల్లో నంబాల కేశవరావును ఇప్పటికే ఎన్‌‌‌‌కౌంటర్​చేసిన భద్రతా బలగాలు.. ఇప్పుడు మడవి హిడ్మాను ఎన్‌‌‌‌కౌంటర్ చేశాయి.  మరోవైపు మల్లోజుల వేణుగోపాల్​, ఆశన్న లాంటి సీనియర్​ లీడర్లు ఇప్పటికే లొంగిపోయారు. మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్​దేవ్‌‌‌‌జీ సైతం పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక ఉద్యమంలో మిగిలిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్​గణపతి మాత్రమే. ఆయన కూడా వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ లెక్కన మావోయిస్టు పార్టీ మనుగడ ఇక కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.