Sankranthi Box Office 2026: సినిమా ప్రేక్షకులకు ‘శుక్రవారం’ వచ్చింది అంటే చాలు.. పండుగ మొదలైనట్టే. విడుదలయ్యే ప్రతి సినిమాపై ఓ లుక్కేస్తారు. కొందరు వీకెండ్‌ను కొత్త సినిమాలతో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తే, మరికొందరు మాత్రం విడుదలైన ప్రతి సినిమాను మిస్ కాకూడదని డిసైడ్ అవుతారు. ఇక పెద్దసినిమాలు వస్తే మాత్రం.. ఆ ‘శుక్రవారం’పెద్ద జాతరే అని చెప్పుకోవాలి. థియేటర్లు, బాక్సాఫీస్ చుట్టూ సందడి పెరిగిపోతుంది. అలాంటి శుక్రవారానికి తోడు నాలుగు రోజుల పాటు సాగే సంక్రాంతి వంటి భారీ పండుగ కలిస్తే.. ఆ కిక్కే వేరు అని చెప్పాలి.
అవును.. ఈ సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు అన్నీ పోటాపోటీగా వస్తున్నాయి. ఒకవైపు భారీ ఫ్యాన్‌బేస్ ఉన్న స్టార్లు, మరోవైపు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలు థియేటర్లను టార్గెట్ చేసుకున్నారు. అందుకే ఈసారి బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండబోదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇన్నేసి సినిమాలు వస్తున్నాయి సరే.. మరి, వాటి ప్రీమియర్స్ సంగతేంటి? రిలీజ్ కానున్న అన్నీ సినిమాలకు ప్రీమియర్స్ పడనున్నాయా? ఏ సినిమా ప్రీమియర్ ఎప్పుడు మొదలవ్వనుంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం..
సంక్రాంతి సినిమాల ప్రీమియర్స్ వివరాలు:
1. ది రాజా సాబ్ (ప్రభాస్ – మారుతి)
➤ జనవరి 8 నైట్ ప్రీమియర్ షో
➤ జనవరి 9న థియేటర్లలో విడుదల
2. జన నాయకుడు (విజయ్ – హెచ్. వినోద్)
➤ తెలుగు వెర్షన్‌కు ప్రీమియర్ షోలు లేవు
➤ జనవరి 9న రిలీజ్
ALSO READ : చిన్న సినిమాలకు పెద్ద గుర్తింపు
3. పరాశక్తి (శివకార్తికేయన్ – సుధ కొంగర)
➤ తెలుగు వెర్షన్‌కు ప్రీమియర్ షోలు లేవు
➤ జనవరి 10న విడుదల
4. మన శంకర వరప్రసాద్ గారు (చిరంజీవి – అనిల్ రావిపూడి)
➤ జనవరి 11న ప్రీమియర్ షోలు
➤ జనవరి 12న రిలీజ్
5. భర్త మహాశయులకు విజ్ఞప్తి (రవితేజ – కిషోర్ తిరుమల)
➤ ప్రీమియర్స్‌పై ఇంకా స్పష్టత లేదు
➤ జనవరి 13న విడుదల
6. నారీ నారీ నడుమ మురారి (శర్వానంద్ – రామ్ అబ్బరాజు)
➤ ప్రీమియర్స్‌పై క్లారిటీ లేదు
➤ జనవరి 14న రిలీజ్
7. అనగనగా ఒక రాజు (నవీన్ పోలిశెట్టి – మారి)
➤ ప్రీమియర్స్ సమాచారం లేదు
➤ జనవరి 14న విడుదల.
