కరీంనగర్, వెలుగు: ఆయన స్వయంగా బీసీ సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. కానీ ఆయనే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానంలో ఓసీ మహిళకు టికెట్ఇచ్చి గెలిపించుకున్నారు. ఇదే విషయమై ప్రత్యర్థులు తాజాగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ మొదలైంది.
సిట్టింగ్ను కాదని..
ఈ ఏడాది జనవరిలో కరీంనగర్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. టికెట్లకేటాయింపు మొదలు కొని వారిని గెలిపించేదాకా అన్ని బాధ్యతలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా చూసుకున్నారు. ఎన్నికల్లో భాగంగా ఆరో డివిజన్ బీసీ (మహిళ) కు రిజర్వ్ అయింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టిం గ్ కార్పొరేటర్ గా ఉన్న సాదవేణి శ్రీనివాస్ తన భార్య సుజాతకు టికెట్ ఆశించారు. ఆయనకు నిరాకరించిన మంత్రి, కోల మాలతికి అవకాశం కల్పించారు. సాదవేణి శ్రీనివాస్ తన భార్య సుజాతను ఇండిపెండెంట్ గా బరిలో నిలిపారు. కోల మాలతి టీఆర్ఎస్ తరఫున విజయం సాధించగా, సాదవేణి సుజాత రెండో స్థానంలో నిలిచారు.
బీసీ కాదు.. ఓసీ
కోల మాలతి విజయం సాధించిన తర్వాత కొద్ది రోజులకే ఆమెది బీసీ కమ్యూనిటీ కాదనే విషయం బయటకు వచ్చింది. ప్రత్యర్థులు ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. మాలతి ఎడ్యుకేషన్ సర్టిఫిర్టి కెట్లపై దృష్టిపెట్టినా దొరకలేదు. కానీ బీఈడీ కోసం రాసిన హాల్ టికెట్ ( 533050038), కౌన్సెలింగ్ సమయంలో ఇచ్చిన సర్టిఫిర్టి కెట్లను సంపాదించి శోధించగా ఆమె ఓసీ అని తేలింది. ఇలా తన ఎడ్యుకేషన్ అంతా ఓసీగా సాగినప్పటికీ జులై 7, 2019న ఎలాగోలా బీసీ(డీ) కులం సర్టిఫికెట్ ర్టి సంపాదించి ఎన్నికల్లో సమర్పించారని తెలుస్తోంది.
చర్యలు తప్పవా?
కోల మాలతి ఓసీ అయినా తప్పుడు కుల సర్టిఫిర్టి కెట్ పెట్టి అక్రమంగా గెలిచారని ఆమె మీద పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన సాదవేణి సుజాత కుటుంబసభ్యులు కరీంనగర్ కలెకర్ ్ట కు మే 29న ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టువి చారణలో మాలతి ఓసీ అని తేలితే కార్పొరేటర్పదవి ఊడడంతోపాటు చట్టపరమైన చర్యలు తప్పవని తెలుస్తోంది. ఫీల్డ్లెవల్ లో విచారణ చేపట్టకుం డా క్యాస్ట్ సర్టిఫిర్టి కెట్ఇచ్చిన తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బంది పైనా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.
