ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘నారీ శక్తి’ ప్రత్యేకంగా నిలిచింది. 147 మంది పురుష కెప్టెన్స్ కమాండ్‌ను తొలిసారిగా ఓ మహిళా కెప్టెన్ లీడ్ చేశారు. ఆర్మీ సిగ్నల్ కాప్స్ కమాండ్‌లో ఆఫీసర్‌గా సేవలందిస్తున్న కెప్టెన్ తానియా షెర్గిల్‌కు ఈ స్పెషల్ చాన్స్ దక్కింది. ఈ ఏడాదిలోనే ఆమెకు ఇలాంటి ప్రత్యేకమైన అవకాశం దక్కడం రెండోసారి కావడం విశేషం. జనవరి 15న జరిగిన ఆర్మీ డే పరేడ్‌లోనూ తానియా పురుషుల కాగ్నిజెంట్‌ను లీడ్ చేశారు. ఆమె కుటుంబం నాలుగు తరాలుగా భారత ఆర్మీకి సేవలందిస్తోంది. తానియా తండ్రి 101 మీడియం రెజిమెంట్‌లో, ఆమె తాత 14వ ఆర్డ్మ్ రెజిమెంట్‌లో, ముత్తాత సిక్కు రెజిమెంట్‌లో పని చేశారు.

పంజాబ్‌లోని హోషియార్పూర్.. తానియా (26) స్వస్థలం. తన తండ్రిని చూసి తానూ ఆర్మీలోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమె చెబుతున్నారు. నాగ్‌పూర్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తానియా 2017లో చెన్నైలోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆర్మీలో సిగ్నల్ కాప్స్ ఆఫీసర్‌గా డ్యూటీలో చేరారు. చిన్ననాటి నుంచే తనకు ఆర్మీలో చేరాలన్న గట్టి సంకల్పం ఏర్పడిందని, తన లక్ష్యాన్ని కుటుంబంతో షేర్ చేసుకున్నప్పుడు ఎంతగానో మెచ్చుకుని ముందుకు నడిపించారని చెబుతున్నారు తానియా. ఆరేళ్ల వయసులో సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పడు తన తండ్రి ఉన్న క్యాంప్‌కు వెళ్లానని అక్కడ రాకెట్ లాంచర్‌ను భుజాన పెట్టుకున్న సంఘటన ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. ఆ రోజు ఎంతో ఎగ్జైట్‌మెంట్ అనిపించిందని చెప్పారు. ఆర్మీ శిక్షణ టైంలో ఎంతో నేర్చుకున్నానని, శరీరాన్ని, మనసును ఎంత దృఢంగా ఉంచుకుంటే అంత డెడికేషన్‌తో ముందుకు సాగుతామని అన్నారామె. మహిళలు సైతం ఆర్మీలో దీటుగా రాణించగలరని చెప్పారు.
More News:
మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం: వీడియో
ఆడ సింహం కోసం.. రెండు మగ సింహాల యుద్ధం: వీడియో
చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వెనుక కారణమిదే

