V6 News

బాలుడిని ఢీకొట్టి తప్పించుకునేందుకు యత్నించిన కారు డ్రైవర్

బాలుడిని ఢీకొట్టి తప్పించుకునేందుకు యత్నించిన కారు డ్రైవర్

హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ & రన్ కేసు నమోదైంది. ఈ ఘటనలో స్విఫ్ట్ డిజైర్ కారు (Br.No TS15EZ0795) ఓ బాలుడిని ఢీకొట్టింది. అనంతరం కారుతో తప్పించుకోవడానికి కారు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు డ్రైవర్ ను చాకచక్యంతో వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన టోలీచౌకిలోని పారామౌంట్ కాలనీలో చోటుచేసుకుంది.

ఆ తర్వాత స్థానికులు కారును ధ్వంసం చేశారు. కారు నడిపి బాలున్ని ఢీ కొట్టిన వ్యక్తి సూడాన్ కు చెందిన ఎన్ఆర్ఐ గా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.