అధికారం పోయాక దివ్యాంగులు గుర్తొచ్చారా?..హరీశ్‌‌‌‌‌‌‌‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అధికారం పోయాక దివ్యాంగులు గుర్తొచ్చారా?..హరీశ్‌‌‌‌‌‌‌‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ఇప్పుడు వారి సంక్షేమంపై మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావుపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. 2014, 2018, మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని గుర్తుచేశారు. పదేండ్ల పాటు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారన్నారు. ఆదివారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఏర్పాటు చేసిన దివ్యాంగుల సమావేశంలో హరీశ్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. దివ్యాంగులను బలవంతంగా సమావేశానికి పిలిపించుకుని విమర్శలు చేయించారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 

దివ్యాంగులకు రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర పరికరాలు అందించామని, వచ్చే ఏడాదిలో మరో రూ.50 కోట్లతో వాహనాలను అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చామని, త్వరలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పూర్తి అంగవైకల్యంతో జన్మించే వాళ్లకు ‘బాల్ భరోసా’ పథకం ద్వారా ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి వైద్యం అందిస్తోందని చెప్పారు. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై సీఎంతో చర్చిస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టో ప్రకారం, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పదేండ్ల హామీలపై, తమ ప్రభుత్వ రెండేండ్ల పాలనలో హామీల అమలుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.