కౌన్సిలర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం..కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఘటన

కౌన్సిలర్  వేధింపులతో ఆత్మహత్యాయత్నం..కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఘటన

హుజురాబాద్, వెలుగు: కౌన్సిలర్​ వేధింపులతో కరీంనగర్​ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..19వ వార్డుకు చెందిన గోస్కుల సత్యనారాయణ ఇంటి నిర్మాణం చేపట్టగా వార్డు కౌన్సిలర్  గోస్కుల రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్  నాలుగు నెలలుగా పనులు అడ్డుకుంటూ వేధిస్తున్నాడు. 

మున్సిపల్  సిబ్బందిని పంపి పనులు ఆపించడం, సామగ్రి సీజ్  చేయించడంతో సత్యనారాయణ గతంలోనే మున్సిపల్  చైర్ పర్సన్, కమిషనర్  దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో మనస్తాపానికి గురై సత్యనారాయణ శనివారం సాయంత్రం బతుకమ్మ సౌళ్ల వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

స్థానికులు హుజురాబాద్  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో జమ్మికుంటలోని ప్రైవేట్  హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు.