వైరా, వెలుగు: వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జూనియర్ బాలబాలికల జిల్లా స్థాయి ఆర్చరీ సెలక్షన్స్ కమ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, ఎస్సై పుష్పాల రామారావు పోటీలను ప్రారంభించారు.
ఆర్చరీ కార్యదర్శి పుట్ట శంకరయ్య పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు.
