నేపాల్‌: టన్నెల్స్ లో ఇంకా 500 మంది..గల్లంతైన 9 జలవిద్యుత్ ప్రాజెక్టుల సిబ్బంది

నేపాల్‌: టన్నెల్స్ లో ఇంకా 500 మంది..గల్లంతైన 9 జలవిద్యుత్ ప్రాజెక్టుల  సిబ్బంది

ఖాట్మాండు: నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వరద ప్రభావిత ప్రాంతాలైన రసువా, నువాకోట్ జిల్లాల్లోని 9 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద గల్లంతైన కార్మికులు, ఉద్యోగుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన టన్నెళ్లు బురద, శిథిలాలతో మూసుకుపోవ డంతో లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద మొత్తం 898 మంది కార్మికులు, ఉద్యోగుల ఆచూకీ దొరకట్లేదని నేపాల్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 361 మందిని కార్మికులను రక్షించగా, 537 మంది ఆచూకీ తెలియరాలేదని సమాచారం.