బీజింగ్: నేపాల్ సరిహద్దులోని టిబెట్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఆదివారానికి 16కి చేరింది. ఈ ప్రమాదంలో 49 మంది భారతీయులతో సహా మొత్తం 546 మంది గల్లంతయ్యారని చైనా అధికారులు తెలిపారు. ఆగస్టు 26న టిబెట్, నేపాల్ సరిహద్దులోని గ్యిరాంగ్ ఇమ్మిగ్రేషన్ పోర్టును ఈ భారీ వరదలు ముంచెత్తాయి.
ఆ సమయంలో టిబెట్‌లోకి వెళ్లేందుకు లేదా అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు వందలాది మంది ఇరువైపులా నిరీక్షిస్తున్నారు. టిబెట్‌లోని గ్యిరాంగ్ కౌంటీలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య 16కి పెరిగినట్లు అధికారులు తెలిపారు.
