గోదావరిఖని: మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలిపై లైంగికదాడి

గోదావరిఖని: మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలిపై లైంగికదాడి

గోదావరిఖని, వెలుగు: మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలిపై లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన 55 ఏండ్ల వృద్ధురాలు రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 28న  చెన్నూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు5ఇంక్లయిన్​ చౌరస్తా బస్​స్టాప్​ వద్దకు వచ్చింది. అశోక్ నగర్​కు చెందిన నదీమ్​అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపి తాను ఆర్టీసీ బస్టాండ్​ వైపు వెళుతున్నానని, అక్కడ దింపుతానని నమ్మబలికి బైక్​పై ఎక్కించుకున్నాడు.

2ఏ బ్రిడ్జి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెహికిల్​ను తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. వారు వన్​టౌన్ ​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో గాలించగా పోలీసులకు నదీమ్​ సెల్​ఫోన్ దొరికింది. నిందితుడు గతంలో  కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు సమాచారం. దీంతో అతడిపై పీడీ యాక్టు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.