కవాసకి నుంచి మరో స్పోర్ట్స్ బైక్ రిలీజ్.. ధర ఎంతంటే..?

కవాసకి నుంచి మరో స్పోర్ట్స్ బైక్ రిలీజ్.. ధర ఎంతంటే..?

కవాసకి ఇండియా 2027 వెర్సిస్ 650ని కొత్త  లైమ్ గ్రీన్ కలర్‌‌‌‌లో  రూ.8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. 649 సీసీ ఇంజిన్‌‌, 67 హెచ్‌‌పీ పవర్ దీని సొంతం. పాత మోడల్స్‌‌తో పోలిస్తే ఫీచర్లు, మెకానికల్స్‌‌లో మార్పులు లేవు. డెలివరీలు ఆగస్టు నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి.

రవాణా ఖర్చు తగ్గించే కార్గోవిమానం ఇది

నేల, నీటిపై నుంచి టేకాఫ్ అయ్యే మానవరహిత కార్గో విమానాన్ని బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఆస్పేరా ఇండస్ట్రీస్ ఆవిష్కరించింది. దీనికి 'యురేకా' అని పేరు పెట్టింది. ఇది 1,000 కేజీల బరువుతో 2,000 కి.మీ దూరం ప్రయాణించగలదు. సముద్ర రవాణా కంటే వేగంగా, విమాన రవాణా కంటే తక్కువ ఖర్చుతో సరుకులను గంటల్లోనే డెలివరీ చేస్తుంది. ఒక టన్ను బరువును కిమీ మోసుకెళ్లడానికి రూ.96 కంటే తక్కువ ఖర్చవుతుందని అంచనా.