ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా ఇన్ యాక్షన్

ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా ఇన్ యాక్షన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని ఇస్కాన్ బంజారాహిల్స్ యువజన సాధికారత విభాగం ఆధ్వర్యంలో యువత జీవితంలో భగవద్గీతలోని శాశ్వత జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేందుకు ‘ గీతా ఇన్ యాక్షన్’ పేరుతో మూడు రోజుల ఉచిత ఆన్‌‌లైన్ కోర్సు ను నిర్వహించనున్నది. అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ కోర్సులో భగవద్గీతలోని 18 అధ్యాయాలను బోధిస్తారు. కెరీర్, సంబంధాలు, ఒత్తిడి నిర్వహణ, సెల్ఫ్​డిసిప్లిన్, మనస్సును నియంత్రించుకోవడం, జీవిత లక్ష్యం, వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలను ఆచరణాత్మకంగా వివరిస్తారు. అనుభవజ్ఞులైన స్వామీజీలు , ఐఐటీ పూర్వ విద్యార్థులు ఈ క్లాసులను జూమ్ ద్వారా తీసుకుంటారు. కోర్సు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. శుక్రవారం రాత్రి 7:30 నుంచి 9:00 గంటల వరకు, శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు స్పెషల్ ఆన్ లైన్ క్లాసులు ఉంటాయి. ఆసక్తి గలవారు https://www.folkexclusive.com/gitainaction వెబ్‌‌సైట్‌‌లో నమోదు చేసుకోవచ్చు. వివరాలకు పరమానంద దాస  9160949128 ను సంప్రదించాలని సూచించారు.