Good life: బీపీ ఉండదు.. టెన్షన్ ఉండదు.. ఇంకా బోలుడు లాభాలు.. అన్నిటికి చిరునవ్వే మంచి మందు..

Good life:  బీపీ ఉండదు.. టెన్షన్ ఉండదు.. ఇంకా బోలుడు లాభాలు.. అన్నిటికి చిరునవ్వే మంచి మందు..

కొంతమంది ఫేస్​ లో ఎప్పుడు నవ్వే ఉంటుంది.  ఎన్ని టెన్షన్స్​ ఉన్నా.. ఎన్ని కష్టాలున్నా సరే చిరునవ్వుతో సమాధానం చెబుతుంటారు.  అలాంటి వారు మైండ్​ చాలా ఫ్రెష్​గా ఉంటుంది.  టెన్షన్​ తో వచ్చే బీపీ ఉండదు.. ఇమ్యూనిటి పవర్​ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. లాఫింగ్​ వలన ఎన్ని లాభాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

బోసినోటితో చిన్నారి నవ్వుతున్నప్పుడు.. పొగిడినప్పుడు, పెరట్లో పూసిన గులాబీని చూసినప్పుడు.. మన ప్రమేయం లేకుండానే ముఖంలో చిరునవ్వు మెరుస్తుంది. అది సహజమే అయినా ఇలా ప్రతిరోజు ఎంతమంది మనసారా నవ్వగలుగుతున్నారు? అంటే.. దానికి సమాధానం కష్టమే. అయితే మనసారా నవ్వడానికి లాఫింగ్ క్లబ్ లకే వెళ్లనవసరం లేదు. ముఖం మీద చిన్న చిరునవ్వు కదలా డేలా చూసుకుంటే చాలు.. నవ్వు వల్ల ఎన్ని లాభాలో..

ఒత్తిడి పెరగదు

ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండేవారికి బీపీ పెరగదు. మైండ్ పై ప్రెషర్ పడదు. ఎంత కష్టంలో ఉన్నా ముఖంపై నవ్వు ఉంటే ఆ కష్టాన్ని ఈజీగా క్రాస్ చేయొచ్చు. సమస్యల ను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే నవ్వు శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది.గుండె సంబంధిత వ్యాధుల నివారణకూ ఇది మంచి మెడిసిన్.

మూడ్ బూస్టర్

చాకొలెట్ ని మూడ్ బూస్టర్ అంటారు. కానీ దాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపించేది చిరునవ్వే. నవ్వు రెండు వేల చాకొలెట్ లతో సమానమైన ఉత్సాహాన్ని ఇస్తుందట.

ఇమ్యూనిటీ పెంచడంలోనూ..

నవ్వు కండరాలను రిలాక్స్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. దెబ్బతిన్న కణాలకు మరమ్మ తు చేస్తుంది. నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారి వయసు అసలు కంటే తక్కువగా కనిపిస్తుం ది. ఇంట్లో అనుబంధాలు పెంచడంలోనూ... బయట సంబంధాలు మెరుగు పరచడం లోనూ నవ్వుది పెద్ద పాత్ర. ఆఖరికి బిజినెస్ డెవలప్ కావాలన్నా..మనసంతా ఉల్లాసంగా ఉండాలన్నా రోజూ నవ్వాలి. మనసారా..!