పంజాగుట్ట, వెలుగు : హైదరాబాద్బుక్ఫెయిర్కు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో కొత్త అధ్యక్షుడిగా రాంపల్లి రమేశ్‌ను ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా కే. బాల్‌రెడ్డి, శోభన్‌బాబు, కార్యదర్శిగా పి.నారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా రజినీ, ట్రెజరర్‌గా కే. సురేశ్ తో పాటు కార్యవర్గ సభ్యులుగా మరో 8 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండేండ్ల పాటు ఉంటుందన్నారు. మాజీ అధ్యక్షుడు యాకూబ్పాల్గొన్నారు.
