జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు గ్రహాలు కలిసి ఒకే రాశిలో సంచరించే సమయంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అంటే 2026 అక్టోబర్ 17 వ తేదీన తులారాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఇప్పటికే తులా రాశిలో సంచరిస్తున్న శుక్రుడు.. బుధుడితో పాటు అక్టోబర్ 17న సాయంత్రం 7 గంటల51నిమిషాలకు సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం వలన ఆరు రాశుల వారికి అన్ని విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని ఆత్మవిశ్వాసం, గౌరవం, అధికారానికి ప్రతీకగా భావిస్తారు. శుక్రుడు సంపద, సౌకర్యం, విలాసవంతమైన జీవితానికి సంబంధించిన గ్రహం కాగా బుధుడు తెలివితేటలు, వ్యాపారం, వాక్చాతుర్యం, సంభాషణకు కారణమని పండితులు చెబుతున్నారు.
మేష రాశి: తులారాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈరాశి వారికి అన్ని విషయాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకొనే అవకాశం ఉంది. అనుకోకుండా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలను రూపొందించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ మెరుగుదల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం లభిస్తుంది.
మిథున రాశి: తులారాశిలో సూర్యుడు,, శుక్రుడు.. బుధుడు కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి.సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి: తులారాశిలో త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్ తో ఈ రాశి ఉద్యోగులకు కొత్త బాద్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సహకారంతో ముఖ్యమైన పనులను సజావుగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. రాబోయే రోజుల్లో వృత్తిపరమైన పురోగతికి మంచి అవకాశాలను కల్పించవచ్చు. . ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్ వేస్తారు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు
ధనుస్సు రాశి : సూర్యుడు.. శుక్రుడు.. బుధుడు తులారాశిలో కలవడం వలన ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి పరంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ పని చేసినా కలసి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు. ఉద్యోగులకు తమ సామర్థ్యాలను నిరూపించుకోవడానికి, కొత్త ప్రాజెక్టులలో పాలుపంచుకోవడానికి అవకాశం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
తులా రాశి: ఇదే రాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారికి అన్ని విషయాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. . ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: తులారాశిలో త్రిగ్రాహియోగం.. సూర్యుడు.. బుధుడు.. శుక్రుడు కలవడం వలన
ఈ రాశి వారికి వృత్తి, ఆర్థిక ప్రణాళికల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి.ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
