సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు వివేక్, పొన్నం

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు వివేక్, పొన్నం

 సికింద్రాబాద్  శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌ దర్శించుకున్నారు. వారితో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, ఏఐసీసీ సభ్యుడు సచిన్‌ సావంత్‌, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.