బర్త్ డే పార్టీ కోసం లాంగ్ డ్రైవ్.. కోకాపేట్లో పల్టీలు కొట్టిన కారు.. ఇంటర్ విద్యార్థి మృతి

 బర్త్ డే పార్టీ కోసం లాంగ్ డ్రైవ్.. కోకాపేట్లో పల్టీలు కొట్టిన కారు..  ఇంటర్ విద్యార్థి  మృతి

గ్రేటర్ సైబరాబాద్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. కోకాపేట్ సమీపంలో ఇన్నోవా కారు పల్టీ కొట్టిన ఘటనలో ఇంటర్ విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. 2026 సెప్టెంబర్ 13న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఏడు మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. 

ఆదివారం మైనర్ విద్యార్థులంతా కలిసి ఔటర్ రింగ్ రోడ్ లో లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. బర్త్ డే పార్టీ అనంతరం లాంగ్ డ్రైవ్ కి వచ్చిన మైనర్ విద్యార్థులు.. ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యారు. మైనర్ విద్యార్థులతో వెళ్తున్న ఇన్నోవా క్రిష్టా కార్   నియో పోలీస్ దగ్గర అదుపుతప్పి పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇంటర్ విద్యార్థి మదన్ మోహన్ రెడ్డి  అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఏడుగురు ఇంటర్ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కారులో మద్యం సీసాలను గుర్తించారు పోలీసులు.. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని  భావిస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.