న్యూడ్‌‌గా పరిగెత్తిన నటుడిపై కేసు నమోదు

న్యూడ్‌‌గా పరిగెత్తిన నటుడిపై కేసు నమోదు

పనాజీ: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్‌‌పై కేసు నమోదైంది. తన బర్త్ డే సందర్భంగా బీచ్‌‌లో న్యూడ్‌‌గా పరిగెత్తినందుకు మిలింద్‌‌ మీద సౌత్ గోవా జిల్లా పోలీసులు కేసు ఫైల్ చేశారు. గోవా బీచ్‌‌లో అశ్లీల వీడియో షూట్‌‌లో పాల్గొందని బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో మిలింద్ సోమన్‌‌పైనా కేసు నమోదు చేయాలని పలు డిమాండ్లు వచ్చాయి.  బీచ్‌‌లో న్యూడ్‌‌గా పరిగెత్తడంతోపాటు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గోవా సురక్షా మంచ్ అనే సంస్థ మిలింద్ సోమన్‌‌పై ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 294, సెక్షన్ 67 ప్రకారం మిలింద్ మీద కేసు నమోదు చేశామని సౌత్ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ అన్నారు.