ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్..! బంగారం షాపులోకి దొంగలు తుపాకులతో వస్తే.. ఏం చేసిందో చూడండి ..!

ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్..! బంగారం షాపులోకి దొంగలు తుపాకులతో వస్తే.. ఏం చేసిందో  చూడండి ..!

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో చైన్ స్నాచింగ్, బంగారం షాపులు, ఇళ్లలో చోరీలు కూడా పెరిగిపోతున్నాయి. ఆ మధ్య కరీంనగర్ PMJ బంగారం షాపులో జరిగిన చోరీ గుర్తుండే ఉంటుంది. అలాంటి ఘటనే నాసిక్ లో జరిగింది. అయితే.. ఈ ఘటనలో షాపు ఓనర్ దైర్యంగా వ్యవహరించడంతో దొంగలు దొరికిపోయారు. శుక్రవారం ( మే 15 ) రాత్రి జరిగిన ఈ ఘటన గురించి వివరాలిలా ఉన్నాయి..

నాసిక్ లోని ఓ బంగారం షాపులోకి తుపాకులతో వచ్చారు ఆరుగురు దుండగులు. షాపులో పనిచేసే సిబ్బంది, ఓనర్ పై తుపాకులు గురి పెట్టి నగలు దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే... ఓనర్ దైర్యంగా వ్యవహరించి షాపులోని వస్తువులు దొంగలపైకి విసిరి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆరుగురు దొంగలు ఒక నగల దుకాణంలోకి చొరబడి, కాల్పులు జరిపి, సిబ్బందిపై దాడి చేసి, ఆభరణాలతో పారిపోవడంతో నాసిక్‌లోని హిరావాడి ప్రాంతంలో కలకలం రేపింది. పంచవటి పోలీస్ స్టేషన్ పరిధిలోని రద్దీగా ఉండే హిరావాడి ప్రాంతంలో ఉన్న న్యూ సమృద్ధి జ్యువెలర్స్‌లో ఈ ఘటన జరిగింది.

రాత్రి షాపు మూసివేసేందుకు సిద్దమవుతున్న సమయంలో ఆరుగురు దొంగలు మూడు బైకులపై వచ్చారని.. షాపులోకి చొరబడి తుపాకులతో సిబ్బందిపై కాల్పులు జరిపారని తెలిపారు ఓనర్. దుండగులు కాల్పులు జరిపిన సమయంలో గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడ్డ సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

షాపు ఓనర్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.