పెట్రోల్​, డీజిల్​, ఏటీఎఫ్​పై ట్యాక్స్​

పెట్రోల్​, డీజిల్​, ఏటీఎఫ్​పై ట్యాక్స్​
  • పెట్రోల్​, డీజిల్​, ఏటీఎఫ్​పై ట్యాక్స్​
  • దేశంలో ధరలు ఎప్పట్లాగే ఉంటాయి


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి పెట్రోల్, ఏవియేషన్​ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్) పై లీటరుకు రూ.ఆరు చొప్పున ఎగుమతి పన్నును విధించింది. డీజిల్​పై రూ.13 వేసింది. దేశీయంగా ఎగుమతులపై మాత్రమే ట్యాక్స్ పెంచినందున  మనదేశంలో డీజిల్,  పెట్రోల్  రిటైల్ ధరలు మారవు. నిల్వలు మరింత పెరుగుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్,  రోస్‌‌‌‌నెఫ్ట్ పెట్టుబడులు ఉన్న నయారా ఎనర్జీ వంటి కంపెనీలను లోకల్​గా పెట్రోల్​, డీజిల్​ సరఫరా చేయడానికి బదులు విదేశీ మార్కెట్‌‌‌‌లకు ఎగుమతి నిరోధించడానికి ఈ పన్ను వేస్తున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్​జీసీ),  ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్​),  ప్రైవేట్ సెక్టార్ కెయిర్న్ ఆయిల్ & గ్యాస్ ఆఫ్ వేదాంత లిమిటెడ్‌‌‌‌ల రికార్డు ఆదాయంపై విధించే క్రూడ్‌‌‌‌పై లెవీ ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. ఏటా దేశీయంగా దాదాపు 30 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అవుతుంది. ఇటీవల, యూకే కూడా తన మద్దతు ప్యాకేజీకి నిధుల కోసం  6.3 బిలియన్​ డాలర్లను సేకరించడానికి ఉత్తర సముద్ర చమురు  గ్యాస్ ఉత్పత్తి నుండి "అసాధారణ" (విండ్​ఫాల్​ ట్యాక్స్​) లాభాలపై 25 శాతం పన్ను విధించింది. ధరల పెరుగుదల భారాన్ని తగ్గించేందుకు  భారత ప్రభుత్వం ఇటీవల పెట్రోల్  డీజిల్‌‌‌‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లింది.