V6 News

ఫేస్ బుక్ ఉద్యోగులపై AI నిఘా : అటూ ఇటూ కదిలినా ఇట్టే పసిగట్టేస్తోంది.. !

ఫేస్ బుక్ ఉద్యోగులపై AI నిఘా : అటూ ఇటూ కదిలినా ఇట్టే పసిగట్టేస్తోంది.. !

Meta.. మెటా అదేనండీ ఫేస్ బుక్, ఇన్ స్టా కంపెనీ. ఓనర్ మన జుకర్ బర్గ్. తన కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ షాక్ దెబ్బకు ఉద్యోగులే బిత్తరచూపులు చూస్తున్నారు. ఉద్యోగం అన్నాక అన్నీ భరించాలి కదా.. కాదనలేని సిట్యువేషన్. మెటా కంపెనీ కింద అమెరికాలో పని చేసే ఉద్యోగులు అందరి కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ లో MCI (మోడల్ కెపాబిలిటీ ఇనిషియేటివ్) అనే సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేశాడు. 

ఇంతకీ ఈ సాఫ్ట్ వేర్ ఏం చేస్తుంది అంటే.. నీ కంప్యూటర్, ల్యాప్ టాప్ లో ఏం జరుగుతుంది.. ఉద్యోగి ఏం చేస్తున్నాడు.. మౌస్ ఆపరేటింగ్.. ఏయే విషయాలను కంప్యూటర్ లో చూస్తున్నాడు.. ఎంత సేపు పని చేస్తున్నాడు.. ల్యాప్ టాప్ పట్టుకుని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనేది మొత్తం చెప్పేస్తుంది.. అణువణువూ ట్రాక్ చేస్తుంది. 

ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోంలో ఓ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి.. అతను ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి.. మరో ఊరు వెళ్లటం.. షాపింగ్ మాల్ లో తిరగటం.. సినిమా ధియేటర్ లో ఉండటం.. ఎక్కడెక్కడో తిరుగుతూ.. అవసరం అయినప్పుడు వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. కొందరు అయితే ఇంట్లో ఉన్నాను అని చెప్పి ట్రావెలింగ్ కూడా చేశారు.. 

ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ లేదు. ల్యాప్ టాప్ ఎక్కడ ఉందో ఈ ట్రాకర్ చెప్పేస్తుంది. లొకేషన్ తో సహా మొత్తం డేటా కంపెనీకి తెలిసిపోతుంది. అంతేనా ల్యాప్ టాప్, కంప్యూటర్ లో మౌస్ కదిలించిన టైం కూడా రికార్డ్ అవుతుంది. లాగిన్, లాగౌట్ మాత్రమే కాదు.. ఆఫీసు ల్యాప్ టాప్ లో ఏ సాఫ్ట్ వేర్ రన్ అవుతుంది.. ఎంత సేపు రన్ అవుతుంది అనే మొత్తం సమాచారం కంపెనీకి చేరిపోతుంది. 

MCI ( మోడల్ కెపాబిలిటీ ఇనిషియేటివ్) సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయటంపై ఉద్యోగులు గరం గరం అవుతున్నారు. దీనిపై జుకర్ బర్గ్ స్పందించారు. కొత్త AI టూల్ తయారు చేస్తున్నామని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కు శిక్షణలో భాగంగా ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది కంపెనీ. ఆఫీసు వస్తువులు.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ కు మాత్రమే ఈ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తున్నామని.. వ్యక్తిగత కంప్యూటర్లకు చేయటం లేదని స్పష్టం చేసింది మెటా కంపెనీ. 

AI శిక్షణ కోసం అని చెబుతున్న మెటా యాజమాన్యం వివరణపై ఉద్యోగులు శాంతించటం లేదు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని ఫీలవుతున్నారు. కంపెనీ ఇచ్చే వర్క్ ను.. కంపెనీ సిస్టమ్ కిందనే చేస్తున్నామని.. కొత్తగా AI శిక్షణ పేరుతో ఇలా చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.