ప్రయాణం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? కాకపోతే జేబు ఖాళీ అవుతుంటేనే అసలు టెన్షన్ మొదలవుతుంది. ఇండియాలో హైవే ప్రయాణాలు పెరిగేకొద్దీ టోల్ ఛార్జీలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణికులకు డబ్బులు ఆదా చేసుకునేందుకు సూపర్ అవకాశాలను కల్పిస్తోంది. ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ టోల్ బిల్లులో సగానికి పైగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. 2026 ఫాస్ట్‌టాగ్ యాన్యువల్ పాస్:
మీరు ఎక్కువగా హైవేలపై తిరుగుతుంటారా? అయితే ఈ కొత్త యాన్యువల్ పాస్ మీకు వరమే. 2026–27 ఆర్థిక సంవత్సరానికి దీని ధర సుమారు రూ. 3,075. ఈ పాస్ తీసుకుంటే ఏడాది కాలంలో లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు మీరు మళ్లీ డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. రాజ్‌మార్గ్ యాత్ర యాప్, NHAI వెబ్‌సైట్ ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు. కేవలం రెండు గంటల్లోనే మీ పాత ఫాస్ట్‌టాగ్ కే ఇది యాక్టివేట్ అవుతుంది.
2. 20 కిలోమీటర్ల రూల్:
మీరు టోల్ ప్లాజాకు దగ్గరలో అంటే 20-24 కిలోమీటర్ల పరిధిలో ఉంటున్నారా? అయితే మీరు ఫుల్ టోల్ కట్టాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం రూ. 340 నుంచి 350 చెల్లిస్తే చాలు.. నెల మొత్తం అపరిమితంగా తిరగొచ్చు. దీని కోసం మీ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేసి లోకల్ పాస్ పొందవచ్చు. అయితే ఇది కేవలం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
3. రిటర్న్ జర్నీ డిస్కౌంట్:
దీని కోసం మీరు ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫాస్ట్‌టాగ్ సిస్టమ్‌లోనే ఉంటుంది. మీరు ఒక టోల్ ప్లాజాను దాటిన తర్వాత.. మళ్లీ అదే దారిలో 24 గంటల లోపు తిరిగి వస్తే, రెండోసారి టోల్ ఫీజులో దాదాపు 50% వరకు తగ్గింపు లభిస్తుంది. కాబట్టి ప్రయాణాన్ని ఆ 24 గంటల విండోలో ప్లాన్ చేసుకుంటే సగం డబ్బులు ఆదా అవుతాయి.
►ALSO READ | భారీ నష్టాల్లో ముగిసిన మన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లను ముంచిన ఆ స్టాక్స్.. రూ.5 లక్షల కోట్లు నష్టం
4. డిస్ట్రిక్ట్ కన్సెషన్:
మీ వాహనం ఏ జిల్లాలో రిజిస్టర్ అయిందో.. అదే జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఇది 50% వరకు ఉంటుంది. అయితే నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలకు ఇది వర్తించదు. దీని గురించి పూర్తి వివరాల కోసం IHMCL పోర్టల్‌లో అర్హతను చెక్ చేసుకోవచ్చు.
5. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు:
నేరుగా NHAI క్యాష్‌బ్యాక్ ఇవ్వకపోయినా.. మనం ఫాస్ట్‌టాగ్ రీఛార్జ్ చేసే బ్యాంకులు లేదా డిజిటల్ వ్యాలెట్లు తరచుగా 1-2% క్యాష్‌బ్యాక్ లేదంటే రివార్డ్ పాయింట్లు ఇస్తుంటాయి. అందుకే రీఛార్జ్ చేసే ముందు బ్యాంక్ యాప్‌లో ఏవైనా ఆఫర్లు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటే మరికొంత డబ్బు ఆదా అవుతుంది. సో ఇకపై హైవే ఎక్కినప్పుడు ఈ ట్రిక్స్ గుర్తుంచుకోండి డబ్బులు ఆదా చేస్కోండి మరి.

