తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచివాలయంలో మే 30న శనివారం నాడు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సెంట్రింగ్ గుత్తదారులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అసోసియేషన్ సభ్యులు.
తమ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను వివరిస్తూ మంత్రి వివేక్ వెంకటస్వామికి సంఘం నాయకులు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. కాంట్రాక్టర్ల సమస్యలపై మంత్రి ఎంతో సానుకూలంగా స్పందించారు. అందులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి.. న్యాయమైన సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా ఖచ్చితంగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చినందుకు మంత్రి వివేక్ వెంకటస్వామికి అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ALSO READ : తెలంగాణలో TRS పార్టీ పక్కా అధికారంలోకి వస్తది
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ (INTUC) రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షులు కృష్ణ, చైర్మన్ సామ పరశురాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్. శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆకుల ప్రవీణ్‌తో పాటు పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
