హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. శనివారం (మే 30) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ (వీసా బాలాజీ) ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కవిత. అనంతరం మొయినాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి పక్కా వస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వచ్చాక విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువరు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
