పీసీసీ చీఫ్ ముందుకు చాకలి ఐలమ్మ వారసుల పంచాయితీ

పీసీసీ చీఫ్ ముందుకు చాకలి ఐలమ్మ వారసుల పంచాయితీ
  • మహిళా కమిషన్ మెంబర్ గా చిట్యాల శ్వేత నియామకం రద్దు చేయాలని వినతి

హైదరాబాద్, వెలుగు: చాకలి ఐలమ్మ కుటుంబం కోటాలో చిట్యాల శ్వేతను రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ మెంబర్ గా నియమించడం వివాదాస్పదమవుతోంది. శ్వేత.. ఐలమ్మ రక్తసంబంధీకురాలు కాదని, ఆమె నియామకాన్ని వెంటనే రద్దుచేసి ఐలమ్మ కుటుంబానికి చెందిన వారికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని  గురువారం పలువురు పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ ను గాంధీ భవన్ లో కలిసి విజ్ఞప్తి చేశారు.

శ్వేత ..ఐలమ్మ మెట్టినింటికి వచ్చిందని, అయితే ఐలమ్మ కుటుంబ సభ్యులను కాదని, మెట్టినింటి నుంచి వచ్చిన ఆమెకు వారసురాలు కోటాలో నామినేటెడ్ పదవి ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తూ  పీసీసీ చీఫ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఐలమ్మ కుటుంబానికి  చెందిన చాలా మంది ఆర్థికంగా వెనుకబడి, దీనావస్థలో ఉన్నారని, అలాంటి వారిని గత ప్రభుత్వం విస్మరించిందని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఆదుకోవాలని ఐలమ్మ కుటుంబీకులు మహేశ్ గౌడ్ కు కలిసి విజ్ఞప్తి చేశారు.