చాంద్రాయణగుట్ట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు.. భారీగా రంగులు, నిల్వ నూనె సీజ్..ముగ్గురు నిర్వాహకులు అరెస్ట్

చాంద్రాయణగుట్ట  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు.. భారీగా రంగులు, నిల్వ నూనె సీజ్..ముగ్గురు నిర్వాహకులు అరెస్ట్

చార్మినార్, వెలుగు: కృత్రిమ సింథటిక్ రంగులు వాడుతూ, కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై హెచ్-ఫాస్ట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు హెచ్-ఫాస్ట్ ఇన్​స్పెక్టర్లు రంజిత్ కుమార్ గౌడ్, అంజయ్య తెలిపారు.

 చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్ మదీనా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఒమర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆహారంలో కలుపుతున్న 3 బాక్సుల కృత్రిమ సింథటిక్ రంగులు, 6 ప్యాకెట్ల కల్తీ ఫుడ్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించేలా పదే పదే వాడుతున్న 20 లీటర్ల వంట నూనెను, 40 కిలోల నిల్వ ఉంచిన ఫ్రైడ్ చికెన్‌‌‌‌ను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కల్తీ ఆహారం విక్రయిస్తున్న ముగ్గురు నిర్వాహకులను రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు  పేర్కొన్నారు.