V6 News

అక్రమ దత్తత చట్టరీత్యా నేరం..మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలి

అక్రమ దత్తత చట్టరీత్యా నేరం..మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలి
  •     జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు:  అక్రమ దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించే ప్రత్యేక హెల్ప్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి చట్టపరమైన విధానాలను పాటించాలని సూచించారు. మే 2 వరకు నిర్వహించే బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం, శిశు సంరక్షణ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న బాలలకు జనన, కుల  ధ్రువీకరణ పత్రాలు, హెల్త్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్కులు, ఇతర గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.