బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిష్ట వేయడానికి చైనా కుట్రలు

బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిష్ట వేయడానికి చైనా కుట్రలు

న్యూఢిల్లీ: లడఖ్ లోని ఇండో చైనా బార్డర్ గల్వాన్ లోయలో ఇండియా, చైనా సోల్జర్ల మధ్య గొడవ జరిగి సోమవారం నాటికి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో రెండు దేశాల మధ్య పలు రౌండ్ల చర్చలు జరిగాయి. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ ప్రకటించాయి. కానీ ఓవైపు చర్చలకు ఓకే అంటూనే.. మరోవైపు బార్డర్ వెంబడి కీలకమైన ప్రాంతాల్లో పట్టు బిగించేందుకు చైనా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. లైన్ ఆఫ్​యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి టెంపరరీ, పర్మనెంట్ ఇండ్లు, దవాఖాన్లు, రోడ్లు నిర్మిస్తోంది. చలికాలంలోనూ ఈజీగా సైనికులను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. రుడాక్, కాంగ్జివర్, గ్యాంట్సే, గోల్మడ్ ఏరియాల్లో చైనా పలు నిర్మాణాలు చేపట్టింది. ఈ ఏర్పాట్లను చూస్తుంటే.. ఎల్ఏసీ వెంబడి దీర్ఘకాలం పాటు తిష్ట వేసేందుకు వీలుగా డ్రాగన్ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లుందని ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. 

బార్డర్​కు ఆవల డ్రిల్స్ 

ఇప్పటికే పాంగాంగ్ సో లేక్ నుంచి రుటాగ్ కౌంటీ వరకూ 4, 6వ డివిజన్ సోల్జర్లను చైనా మార్చింది. వీరి స్థానంలో 8, 11వ డివిజన్ సోల్జర్లను మోహరించింది. ప్రతి డివిజన్ వద్దా పూర్తిస్థాయి వెపన్స్, వెహికల్స్ సిద్ధంగా ఉంచింది. అరుణాచల్​ ప్రదేశ్​లోని తవాంగ్, ఇతర ప్రాంతాలకు అపోజిట్​గా టిబెట్​లో చైనా ఆర్మీ ప్రత్యేక డ్రిల్స్ కూడా నిర్వహించింది. ఇటీవలే షిగాట్సే వద్ద గన్ ఫైరింగ్, యాంటీ ట్యాంక్ రాకెట్ లాంచర్లు, గ్రనేడ్ లాంచర్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మెషిన్ గన్స్ వాడకంలో ట్రెయినింగ్ కూడా ఇచ్చింది. 

పూర్తి కాని డిస్​ఎంగేజ్​మెంట్

గల్వాన్ గొడవ తర్వాత జరిగిన చర్చల్లో అంగీకరించిన ప్రకారం.. ఇరుదేశాలు తమ సోల్జర్లను గల్వాన్ లోయ, పాంగాంగ్ సో నుంచి వెనక్కి తీసుకున్నాయి. అయితే గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెమ్చోక్, దేప్సాంగ్ వ్యాలీలో డిస్​ఎంగేజ్​మెంట్​లో మాత్రం పరిస్థితి మారలే. ఇప్పటివరకూ ఇండియా, చైనా11 రౌండ్లు చర్చలు జరిపాయి. మరో రౌండ్ చర్చలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో చైనాతో కచ్చితంగా ఉంటూనే ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేలా వ్యవహరిస్తున్నామని ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే చెప్పారు. ఎల్ఏసీ వెంబడి ఏప్రిల్ 2020 నాటికి ఉన్న పరిస్థితిని పునరుద్ధరించేలా తదుపరి రౌండ్ చర్చలు జరగాల్సి ఉందన్నారు.

ఆ రోజు ఏం జరిగింది?

సిక్కిం సరిహద్దులోని డోక్లాంలో చైనా 2017లో తన సైన్యాన్ని మోహరించడం తో ఇండో చైనా బార్డర్​లో టెన్షన్స్ మొదలయ్యాయి. కొన్నాళ్లకు ఆ టెన్షన్స్ సద్దుమణిగాయి. ఆ తర్వాత లడఖ్​లోని పాంగాంగ్ సో సరస్సు, గల్వాన్ లోయ, టిబెట్ ఆటోనామస్ రీజియన్ ప్రాంతాల్లో నూ చైనా సోల్జర్లు ఆక్రమణలకు దిగడం తో 2020 మే నెల నుంచి మళ్లీ బార్డర్​లో టెన్షన్స్ మొదలైనయ్​. గల్వాన్ లోయలో మే 21న మన సైన్యం బార్డర్ దాటిందం టూ చైనా ఆరోపించగా, ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా చైనా సైన్య మే అడ్డుతగిలిందని కేంద్రం స్పష్టం చేసింది. లడఖ్​లో సైనిక కమాండర్లు చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రి తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. కానీ జూన్ 15న గల్వాన్ లోయలో రెండు దేశాల సోల్జర్ల మధ్య గొడవ జరిగింది. ఇందులో మన సోల్జర్లు 20 మంది అమరులయ్యారని ఆర్మీ ప్రకటించగా.. తమ వైపు ఐదుగురు మాత్రమే చనిపోయారని చైనా ఆర్మీ ప్రకటించింది.