
–రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి.లేటెస్ట్గా VD12 నుంచి క్రేజీ టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం..ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. అయితే ఈ సినిమాలో కథానుగుణంగా పాటల అవసరం లేదట. కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం.
అయితే, ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో హైప్ భారీ స్థాయిలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు. అనిరుధ్ సినిమా అంటే..అదిరిపోయే సాంగ్స్, బీజీమ్స్, బిట్ సాంగ్స్ ఉంటాయి. కానీ, ఈ సినిమాలో పూర్తి స్థాయిలో పాటలు లేవనే టాక్ వస్తుండటంతో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. కథరీత్యా ఉన్న ఎమోషన్‌ను ఎక్కడా డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశ్యంతో పాటలు వొద్దనుకున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ, అక్కడక్కడా మధ్యలో వచ్చే బిట్‌సాంగ్స్ వినిపిస్తాయని తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ విశాఖపట్నంలో జరగనుంది.VD 12ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజూ(Mamitha Baiju)ను లేదా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)లో ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన హీరో నాని(Nani) తీసిన చిత్రం జెర్సీ(Jersey).2019లో రిలీజైన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించి,ఇప్పటివరకు అనేక అవార్డులు గెలుచుకుంది.ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అవ్వడంతో ఇప్పటికీ ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది. మరి ఇలాంటి కాంబోలో సాంగ్స్ అసలే లేవంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.