KKR vs PBKS: కేకేఆర్ ఓపెనర్లు వీర విధ్వంసం.. 10 ఓవర్లలో 8 సిక్సులు, 15 ఫోర్లు

KKR vs PBKS: కేకేఆర్ ఓపెనర్లు వీర విధ్వంసం.. 10 ఓవర్లలో 8 సిక్సులు, 15 ఫోర్లు

ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులకు వినోదం పంచడంలో అసలు వెనక్కి తగ్గట్లేదు. సీజన్ ప్రారంభం నుంచి భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న ఈ జట్టు.. మరోసారి పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ పై 10 ఓవర్లోనే ఏకంగా 138 పరుగులు చేసింది. ఈ స్కోర్ అంతా ఒక్క వికెట్ నష్టపోకుండా కొట్టడం విశేషం. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ పంజాబ్ బౌలర్లను దంచికొట్టారు. 

నరైన్ 3 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేస్తే.. సాల్ట్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేశాడు. వీరి ధాటికి పవర్ ప్లే లో ఏకంగా 76 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే తర్వాత ఈ జోడీ మరింత విధ్వంసం సృష్టించింది. తర్వాత నాలుగు ఓవర్లలో ఏకంగా 62 పరుగులు రాబట్టింది. వీరి ధాటికి స్టార్ బౌలర్ రబడా 2 ఓవర్లలోనే 43 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షల్ పటేల్ తన తొలి రెండు ఓవర్లో 37 పరుగులు ఇచ్చాడు. వీరి జోరు చూస్తుంటే కేకేఆర్ ఈ టోర్నీలో మరోసారి 250 పరుగుల మార్క్ టచ్ చేసేలా కనిపిస్తుంది.