భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు

భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు

భార్యకు చెందిన స్త్రీ ధనం (వారసత్వ ఆస్తి..  పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో దానిని వాడుకున్నా భార్యకు తిరిగిచ్చేయాలని తేల్చిచెప్పింది. కేరళకు చెందిన ఓ మహిళకు 2009లో పెళ్లైంది. పెళ్లి టైమ్ లో ఆ మహిళ కుటుంబం ఆమెకు 89 బంగారు నాణేలను ఇచ్చింది.  అంతేకాకుండా ఆమె భర్తకు రూ.2 లక్షల చెక్కును అందజేసింది. వీటిని భద్రంగా దాచుతానని నమ్మబలికిన  ఆమె భర్త వాటిని తన అవసరాలకు వాడుకున్నాడు. కొన్ని రోజులకు ఈ విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో అమె తన ఇంటి వారు ఇచ్చిన బంగారం, డబ్బులు ఇవ్వాలంటూ కేరళ హైకోర్టులో కేసు వేసింది. అయితే  ఆ బంగారాన్ని  భర్త దుర్వినియోగం చేశారనేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఈ క్రమంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.   దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 2009లో 89 బంగారు నాణేల రేటు రూ.8.90 లక్షలు ఉండేది.  అప్పుడు వాడుకున్నదానికి నష్టపరిహరంతో కలిపి ఆమెకు బంగారానికి బదులుగా రూ.  25లక్షలు చెల్లించాలని ఆమె  భర్తను ఆదేశించింది. ఇదంతా ఆరు నెలల్లోనే జరగాలని  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.