తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇండ్లు : ఎండీ గౌతమ్

తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇండ్లు : ఎండీ గౌతమ్
  • నిర్మించేలా చూడాలి: ఎండీ గౌతమ్

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పూర్తైన ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ బుధవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టని వారిని ప్రోత్సహించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రభుత్వం నిర్మించిన మోడల్ హౌస్​లను లబ్ధిదారులకు చూపిస్తూ, తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇండ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

పనులు పూర్తైన వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎస్ఈ చైతన్య, పీడీ చంప్లా నాయక్, డీఈ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ పాల్గొన్నారు.