జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి  : టీజేఎఫ్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి  : టీజేఎఫ్

ఖమ్మం టౌన్, వెలుగు: దశాబ్ద తరబడి అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, జర్నలిస్టుల బృందం కోరారు.

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో బుధవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రులు పాల్గొనగా, జర్నలిస్టు సంఘం నాయకులు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన మంత్రులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా కార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, టీడబ్ల్యూజేఎఫ్​ఆధ్వర్యంలోనూ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు.