సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్ 

సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్​లో యాజమాన్యం బుధవారం స్ట్రక్చర్ మీటింగ్​ నిర్వహించింది. హెడ్డాఫీస్​ నుంచి బాబు క్యాంప్ వరకు రోడ్డు విస్తరణ, ప్రకాశం స్టేడియం అభివృద్ధి, మెయిన్ హాస్పటల్​లోని మేల్, ఫిమేల్ వార్డులతోపాటు క్యాజువాలిటీల్లోని వాష్​ రూంలలో శానిటరీ పరికరాలు, సౌకర్యాలు ఇతర సమస్యలను యూనియన్​ ప్రతినిధులు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కంపెనీ జీఎం పర్సనల్ కవితా నాయుడు పేర్కొన్నారు. సంఘం ప్రతినిధులు వంగా వెంకట్, ఎస్​వీ రమణమూర్తి, రాము తదితరులు పాల్గొన్నారు.