ఐబీవో స్టేట్ టాపర్ గా స్నేహిత్

ఐబీవో స్టేట్ టాపర్ గా స్నేహిత్

ఖమ్మం టౌన్, వెలుగు : ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ (ఐబీవో) స్టేట్ టాపర్ గా ఎస్ వీఎం సెంట్రల్ పబ్లిక్ స్కూల్ లో 4వ తరగతి చదువుతున్న నల్లి స్నేహిత్ నిలిచాడు. గత నెలలో ఐబీవో నిర్వహించిన నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ కాంపిటేటివ్ పరీక్షల్లో స్టేట్ టాపర్ గా ఎంపికయ్యాడు.

బుధవారం హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐబీవో చైర్మన్ రామకృష్ణ, ప్రముఖ సినీ నటులు శివ బాలాజీ, ప్రముఖ విద్యావేత్తలు ఎంపికైన విద్యార్థులకు అవార్డులు ప్రశంసా పత్రాలు అందజేశారు.

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తాము పదేండ్లుగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా, అవార్డు అందుకున్న స్నేహిత్ ను ఎస్వీఎం స్కూల్ ప్రిన్సిపల్ ప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు.